పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. వైసీపీ నేత మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు
- చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడిగా మోహిత్‌రెడ్డి
- నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విచారణ అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేయగా, ప్రత్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బరిలోకి దిగారు. పోలింగ్ అనంతరం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూం పరిశీలనకు వెళ్తున్న క్రమంలో పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో మోహిత్‌రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు.