ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్ కారును అడ్డుకున్న మాజీ జడ్జి రామకృష్ణ
- ఏపీలో ప్రజాస్వామ్యం మంటగలుస్తోందన్న వైసీపీ
- హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం
- నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిరసన ప్రదర్శన
- జగన్ కు మద్దతు ప్రకటించిన అఖిలేశ్ యాదవ్
అఖిలేశ్ వాహనాన్ని ఆపిన రామకృష్ణ... ఆయనకు జగన్, విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను వినిపించారు. ఇలాంటి వ్యక్తులు తెలిపే నిరసనలకు మద్దతు ఇవ్వడం సబబు కాదని అన్నారు. గత ఐదేళ్లు ఏపీలో జగన్ విధ్వంసానికి పాల్పడ్డారని అఖిలేశ్ యాదవ్ కు వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.