ఇన్ స్టా రీల్స్ కోసం బైక్ స్టంట్స్.. హయత్ నగర్ లో యువకుడి మృతి.. వీడియో ఇదిగో!
- ప్రాణాపాయ స్థితిలో మరో యువకుడు
- వర్షంలో స్టంట్స్ చేస్తుండగా స్లిప్ అయిన బైక్
- కిందపడ్డ యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌తో స్టంట్ చేశారు. సింగిల్ వీల్‌పై బైక్ నడుపుతూ హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడగా.. శివ అనే యువకుడు చనిపోయాడు. బైక్ నడిపిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.