రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ ఉండాలి.. తెల్ల రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దు: రేవంత్ రెడ్డి
- ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్న రేవంత్
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యుల పారితోషికం పెంచాలన్న సీఎం
- హాస్పిటల్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలని సూచన
ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని... దీనికి సంబంధించి అధ్యయనం చేసి, కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. హాస్పిటల్స్ నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ కేటాయించాలని చెప్పారు.