వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్
Add ap7am to your home Screen

వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్

Jabardasth rohini releases video expressing her anger
  • రేవ్ పార్టీలో దొరికిపోయినట్టుగా రోహిణి నటించిన ఫన్నీ వీడియో వైరల్
  • వీడియోపై ఓ విలేకరి కామెంట్స్‌కు మండిపడ్డ రోహిణి
  • పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారంటూ ఆగ్రహం
జబర్దస్త్ రోహిణి తాజాగా ఓ జర్నలిస్టుపై ఫైర్ అయిపోయింది. ఓ విలేకరి అయ్యుండీ ఇలా మాట్లాడొచ్చా? అంటూ అగ్గిమీద గుగ్గిలమైపోయింది. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా షేర్ చేసింది. 

‘‘నేను బర్త్‌డే అనే దానికి ప్రమోషన్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని మీడియా తెలుసుకుని దానిన్ని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ, ఓ సీనియర్ జర్నలిస్టు మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. రేవ్ పార్టీ అనగానే నిజంగానే దొరకే ఉంటుందని, నిప్పు లేకుండా పొగ రాదని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడతారు? పైగా ఆయన సీనియర్ జర్నలిస్టు అని చెప్తున్నారు. మరి ఆయన అలా ఎలా మాట్లాడతారు? నేను మందు కూడా తాగను. అందులో చూపించేవి అన్నీ నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని, అందుకే పెళ్లి కాక అలా ఉండిపోయానని అన్నాడు. లావుగా ఉంటే పెళ్లి కాదా.. సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’’ అంటూ ఫైరైపోయింది రోహిణి. 

ఇటీవల రోహిణి రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తర్వాత ఇదంతా ఫన్ కోసం చేసిందని తెలిసి జనాలు స్థిమితపడ్డారు. ప్రమోషన్స్‌లో భాగంగా రోహిణి ఇలా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే, ఓ జర్నలిస్టు మాత్రం వీడియోపై వివాదాస్పద కామెంట్స్ చేసి రోహిణి ఆగ్రహానికి గురయ్యారు. 

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో పాప్యులారిటీ సాధించిన రోహిణి ఆ తరువాత కమెడియన్‌గా పలు షోల్లో నటించి మెప్పించారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న అతికొద్ది మద్ది టీవీనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
Advertisement
Jabardasth Rohini
Viral Videos

More Telugu News