సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు: బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి
- సీఎంకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని విమర్శ
- ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న
- 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపాటు
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది మరిచిపోయారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రియాంకగాంధీని తీసుకువచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు.