ప్రిలిమ్స్ ఫెయిలైన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

07-07-2024 Sun 15:31 | Telangana
Advertisement
  • జూన్ 9న తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ
  • నేడు ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ
  • మెయిన్ కు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అక్టోబరు 21-27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని తెలిపారు. 

ఇక, ప్రిలిమ్స్ లో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికోసం ప్రయత్నించడం, విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడాన్ని ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరతారని తన ట్వీట్  లో పేర్కొన్నారు. 

తెలంగాణలో జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగడం తెలిసిందే. ఈ పరీక్షకు 3.20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Advertisement
Revanth ReddyGroup-1PrelimsResultsMainsCongressTelangana

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more