Chandrababu: ఏపీ సీఎంగా తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు

AP CM Chandrababu At NTR Trust Bhavan In Hyderabad
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా సాగారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 

నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మరికాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలు సన్మానం చేయనున్నారు.


Go Back to Shorts
Chandrababu
NTR Bhavan
Jubilee Hills
TDP
Telangana

More Telugu News