ప్రెగ్నెన్సీ వార్తలపై సోనాక్షిసిన్హా స్పందన
- గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్న సోనాక్షి సిన్హా
- ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని ప్రచారం చేస్తున్నారని విమర్శ
- ఇకపై ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదని వ్యాఖ్య
ఆసుపత్రికి వెళ్తే తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారని... అందుకే తాము ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను చూసేందుకు సోనాక్షి ఆసుపత్రికి వెళ్లారు. దీంతో, ఆమె గర్భవతి అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. సోనాక్షి, ఇక్బాల్ ఇద్దరూ 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో కలిసి నటించారు.