Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాల్వీ మల్హోత్రా వల్లే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు: లావణ్య

Lavanya severe ellegations against Raj Tarun
Advertisement
  • రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన లావణ్య
  • మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు
  • 11 ఏళ్ల పాటు ఇద్దరం కలిసే ఉన్నామని వెల్లడి
  • నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నానని వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపణ
  • కానీ మాల్వీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని స్పష్టీకరణ
Advertisement
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించడం తెలిసిందే. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడారు. రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ కు, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాకు సంబంధం ఉందని ఆరోపించారు. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే తనను చంపేసి శవాన్ని కూడా మాయం చేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని వెల్లడించారు. 

"రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా తాజాగా తిరగబడరసామి చిత్రంలో నటించారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కు, మాల్వీకి పరిచయం ఏర్పడింది, ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇదంతా కామన్ కదా అని వదిలేశాను. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ముదిరింది. 

2012 నుంచి నేను, రాజ్ తరుణ్ లవ్ చేసుకుంటున్నాం. 2014 నుంచి కలిసి ఉంటున్నాం. అయితే, 3 నెలల కిందట రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఎందుకు వెళ్లిపోయావు అని అడిగితే... డ్రగ్స్ కేసు అంటున్నాడు. కానీ అతడు వెళ్లిపోయింది డ్రగ్స్ కేసు కారణంగా కాదు... మాల్వీ మల్హోత్రా వల్లే వెళ్లిపోయాడు. అతడ్ని ఆమె చాలా ప్రభావితం చేస్తోంది. 

నేను రాజ్ తరుణ్ గాళ్ ఫ్రెండ్ అనేందుకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవాళ నేను నార్సింగి పోలీసులకు మాల్వీపైనా, ఆమె బ్రదర్ పైనా కంప్లెయింట్ ఇచ్చాను. నిన్ను జైలుకు పంపిస్తామంటూ వాళ్లు నన్ను అక్టోబరులోనే బెదిరించారు. జనవరి 28న నేను డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లాను. వాస్తవానికి ఆ డ్రగ్స్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు. డబ్బుల కోసం డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు డబ్బులు ఇవ్వడానికి రాజ్ ఉన్నాడు. మీడియాలో నాపై వచ్చిందంతా ఫేక్. నాపై ఆ డ్రగ్స్ కేసు ఎప్పటికీ నిలబడదు. 

11 ఏళ్లుగా రాజ్ ఎలాంటి వాడో నాకు తెలుసు. నన్ను ఇలా వదిలేసి వెళ్లిపోవడం బాధాకరమే అయినా, మాల్వీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. నేను 45 రోజులు జైల్లో ఉంటే రాజ్ ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు తెలుస్తోంది... దీనింతటికీ కారణం మాల్వీ అని. నువ్వు డ్రగ్స్ కేసులో ఉన్నావు కదా... నీతో ఉంటే మీడియా, పోలీసుల వల్ల ఇబ్బంది కలుగుతుంది... రెండు నెలల తర్వాత నేనే వస్తాను అని రాజ్ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. 

రెండు నెలల తర్వాత రాజ్ కు ఫోన్ చేస్తే... మాల్వీ విషయం చెప్పాడు. మాల్వీ వాళ్లు కూడా నన్ను నేరుగా బెదిరించడం ప్రారంభించారు. నీకు పరిహారం చెల్లిస్తాం... రాజ్ ను వదిలేయ్ అన్నారు. రాజ్ తరుణ్ కు, నాకు షార్ట్ ఫిలింస్ నేపథ్యంలో పరిచయం ఏర్పడింది. నేను కూడా కొన్ని షార్ట్ ఫిలింస్ లో నటించాను. అయితే నేను నటించడం అతడికి ఇష్టం లేదు. 

రాజ్ తరుణ్ నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పేరెంట్స్ కు ఈ విషయం చెప్పాం. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉంటున్నాం. నేను రాజ్ ఇష్ట ప్రకారం నటన వదిలేసి ఇంటివద్దే ఉండేదాన్ని. కానీ నన్ను అన్యాయంగా వదిలేశాడు. రాజ్ తిరిగి నా వద్దకు రావాలనే నేను ఈ పోరాటం చేస్తున్నాను" అని లావణ్య వివరించారు.
Advertisement
Advertisement
Lavanya
Raj Tarun
Malvi Malhotra
Police
Tollywood

More Telugu News