కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు

01-07-2024 Mon 12:26 | Andhra
Advertisement
  • ఏపీలో కొన‌సాగుతున్న‌ పెన్ష‌న్ల పంపిణీ
  • ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని అడ‌విపాలెంలో మంత్రి నిమ్మల పింఛ‌న్ల‌ పంపిణీ
  • అనారోగ్యంతో ఉన్న‌ లారీ డ్రైవ‌ర్‌కు తొలి పింఛ‌న్ అంద‌జేత‌
  • ఈ క్ర‌మంలో వృద్ధులు, విక‌లాంగుల కాళ్లు క‌డిగిన మంత్రి నిమ్మల
Advertisement
ఏపీలో పెన్ష‌న్ల పంపిణీ జ‌రుగుతోంది. మంత్రి నిమ్మ‌ల రామానాయుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా య‌ల‌మంచ‌లీ మండ‌లం అడ‌విపాలెంలో అనారోగ్యానికి గుర‌యిన లారీ డ్రైవ‌ర్‌కు తొలి పింఛ‌న్ అందించి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. 

ఇదే గ్రామానికి చెందిన పెద‌పాటి భాగ్య‌ల‌క్ష్మి కాళ్లు క‌డిగారు మంత్రి.  అలాగే పాల‌కొల్లులో ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు అంద‌జేశారు. కూటమి ప్ర‌భుత్వం ఇచ్చిన ప్ర‌తీ హామీని నెర‌వేరుస్తుంద‌ని మంత్రి తెలిపారు. టీడీపీ కూట‌మికి చారిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన రాష్ట్ర ప్ర‌జ‌లకు రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.  

ఈ క్ర‌మంలో ఆయన వృద్ధులు, విక‌లాంగుల కాళ్లు క‌డిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌తి నెల పెరిగిన పెన్ష‌న్ ల‌బ్ధిదారుల ఇంటికి చేరుతుంద‌న్నారు. 

కాగా, సీఎం చంద్రబాబు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పెన్ష‌న్‌ అందజేశారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందజేశారు.

Advertisement
Nimmala Rama NaiduAndhra PradeshPensionTDP

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more