నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల విడుదల

01-07-2024 Mon 12:23 | National
Advertisement
  • ఎన్ టీఏ అధికారిక వెబ్ సైట్ లో రివైజ్డ్ ఫలితాలు, స్కోర్
  • 67 నుంచి 61కి టాపర్ల సంఖ్య తగ్గినట్లు విశ్వసనీయ వర్గాల వెల్లడి
  • 1,563 మందికిగాను రీ ఎగ్జామ్ రాసింది 813 మంది విద్యార్థులే
  • పేపర్ లీక్ పై కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు.. ఇప్పటివరకు ఆరుగురి అరెస్టు
Advertisement
నీట్ యూజీ ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. తమ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET/ లో రివైజ్డ్ ఫలితాలను అందుబాటులో ఉంచామని.. రీ ఎగ్జామ్ రాసిన వారితోపాటు ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులంతా రివైజ్డ్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్ టీఏ తెలిపింది.

అయితే ఎన్ టీఏ వర్గాల సమాచారం ప్రకారం తాజా ఫలితాలతో టాపర్ల సంఖ్య తొలిసారి ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గినట్లు తెలిసింది. మొత్తం 1,563 మంది విద్యార్థులకుగాను 813 మందే జూన్ 23న రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 750 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు మినహాయించగా వచ్చే పాత స్కోర్ కే కట్టుబడతామని ఇప్పటికే తెలిపారు.

ఎంబీబీఎస్ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పేపర్ కాస్త ఆలస్యంగా ఇవ్వడం వల్ల పరీక్ష సమయం కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు వారు సాధించిన స్కోర్ కు అదనంగా 5 గ్రేస్ మార్కుల చొప్పున ఎన్ టీఏ కలిపింది. 

అయితే దీనిపై ఇతర విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించి టాపర్లుగా నిలవడం, కొన్నిచోట్ల పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, జులై 6 నుంచి జరిగే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ను నిలిపేయాలని కోరారు. అయితే ఈ డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది. 

మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ టీఏ డైరెక్టర్ ను ఆ పదవి నుంచి తప్పించింది. అలాగే దీనిపై అంతర్గత దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కు సంబంధించి బిహార్ లో పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసు దర్యాప్తును కేంద్రం సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.
Advertisement
NEET UG 2024ReexamResultsAnnouncedNTA

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more