తిరుమలలో రద్దీ.. దర్శనానికి 18 గంటలు

Rush in tirumala 18 hours for darshan
షార్ట్స్‌లో చూడండి
తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకూ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, జూన్ 29వ తేదీ శనివారం రోజున 80,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుద్ధమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జే శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమలలో పెద్ద, జనతా హోటళ్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
Go Back to Shorts
Tirumala
TTD
Andhra Pradesh
Telangana

More Telugu News