భగవంతుడా... ఇలాంటి ప్రాంతాన్ని ఎలా మిస్సవుతున్నాను?: రష్మిక మందన్న
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భగవంతుడా... ఇలాంటి ప్రాంతాన్ని ఎలా మిస్సవుతున్నాను?: రష్మిక మందన్న

Rashmika Mandanna enjoys with friedns in Kodagu
  • కొడగులో సందడి చేసిన రష్మిక
  • ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన కన్నడ భామ
  • ఇది నా సొంత గడ్డ అంటూ ట్వీట్
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అందాల రష్మిక మందన్న ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు పుష్ప-2లో నటిస్తున్న ఈ కన్నడ భామ... బాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. సల్మాన్ ఖాన్ సరసన 'సికిందర్', విక్కీ కౌశల్ హీరోగా 'చావా' సినిమాలో నటిస్తోంది. 

రష్మిక తాజాగా కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి విచ్చేసింది. కొడగు... ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అక్కడ రష్మిక తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను అమ్మడు సోషల్ మీడియాలో పంచుకుంది. 

"కొడగు... ఇక్కడ నా చరిత్ర, నా హృదయం ఉన్నాయి. నేను, నా స్నేహితురాళ్లు ఇక్కడే పెరిగాం. భగవంతుడా... నా సొంతగడ్డను ఎలా మిస్సవుతున్నాను?" అంటూ రష్మిక ట్వీట్ చేశారు. కొడగు ప్రాంత సంప్రదాయాలను అనుసరించి రష్మిక దుస్తులు ధరించడాన్ని ఫొటోల్లో చూడొచ్చు.
Advertisement
Rashmika Mandanna
Kodagu
Actress
Pushpa-2

More Telugu News