మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేత పుట్టా మధు విమర్శలు
- ఓటుకు రూ.2 వేలు ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని విమర్శ
- మంథని అభివృద్ధిని పక్కకు పెట్టి డబ్బు సంపాదనపై పడ్డారని ఆరోపణ
- కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం... దగా అన్న పుట్టా మధు
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం... దగా అన్నారు. ఈ ఆరు నెలల పాలన మరోసారి దానిని రుజువు చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజవనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. యథేచ్చగా ఇసుక తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీలలో మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు, ఆయన కుటుంబం జేబుల్లోకి వెళ్తోందన్నారు.