Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీఎస్పీని కానిస్టేబుల్ గా డిమోట్ చేసిన యూపీ సర్కారు.. కారణం ఇదే!

Senior UP Police officer demoted to constable
Advertisement
  • మహిళా కానిస్టేబుల్ తో రొమాన్స్ చేస్తూ హోటల్ లో పట్టుబడ్డ డీఎస్పీ
  • మూడేళ్ల కిందట మహిళా కానిస్టేబుల్ తో హోటల్ లో ప్రణయం
  • భర్త కనిపించట్లేదని ఎస్పీని ఆశ్రయించిన డీఎస్పీ భార్య
  • విచారణలో భర్త నిర్వాకం బయటపడడంతో షాక్
Advertisement
ఉద్యోగం మాత్రమే పెద్దది.. బుద్ధులు మాత్రం చిన్నవే.. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సదరు ఉన్నతాధికారిని చిన్న పోస్టుకు డిమోట్ చేసింది. ఏకంగా డీఎస్పీ ర్యాంకు నుంచి కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారాడా ఉద్యోగి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మాజీ డీఎస్పీ కృపా శంకర్ కనౌజియా మూడేళ్ల కిందట ఓ మహిళా కానిస్టేబుల్ తో హోటల్ లో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో శాఖాపరమైన విచారణ జరిపించిన పోలీస్ శాఖ.. తాజాగా కృపా శంకర్ ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..
2021లో డీఎస్పీ కృపా శంకర్ ఆఫీసుకు లీవ్ పెట్టి ఎటో వెళ్లిపోయాడు. అసలే కరోనా కాలం.. ఆపై భర్త కనిపించకపోవడంతో కృపా శంకర్ భార్య ఆందోళన చెందింది. వెంటనే ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్.. సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా కృపా శంకర్ ను వెతుక్కుంటూ వెళ్లారు. చివరకు ఓ హోటల్ లో కృపా శంకర్ ఉన్నట్లు గుర్తించి ఆయన భార్యతో సహా వెళ్లి తలుపుతట్టారు. లోపల ఓ మహిళా కానిస్టేబుల్ తో రొమాన్స్ చేస్తూ కృపా శంకర్ దొరికిపోయాడు. భర్త నిర్వాకం కళ్లారా చూసిన భార్య షాక్ కు గురైంది. ఇటు ఓ ఉన్నతాధికారి, అటేమో డిపార్ట్ మెంట్ కు చెందిన చిరుద్యోగి కావడంతో పోలీస్ శాఖ అంతర్గత విచారణ జరిపించింది. ఇద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. డీఎస్పీ కృపా శంకర్ ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Advertisement
Advertisement
DSP To Conistable
UP Police
Women conistable
Caught in Hotel
Demotion

More Telugu News