ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు

20-06-2024 Thu 06:24 | Andhra
Advertisement
  • అంత‌కుముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు
  • అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవ‌కాశం 
  • ఇప్పుడు హరీశ్ స్థానంలో తిరుమ‌ల‌రావు నియామకం 
  • ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావు
Advertisement
ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్‌టీసీ ఎండీగా నియమితులయ్యారు. గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు. అంతకుముందు రైల్వే శాఖలో డీజీపీగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ ప‌ని చేశారు. 

ఇక‌ గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవ‌కాశం ద‌క్కింది. దాంతో మే 6న ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా కొలువుదీరిన కూట‌మి స‌ర్కార్ కూడా ఆయ‌న‌నే డీజీపీగా కొనసాగించాల‌ని భావించింది. 

అయితే, చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన గంద‌ర‌గోళం ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం ప‌లికేందుకు వెళ్లాల్సిన‌ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయ‌న కాన్వాయ్ ఏకంగా 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో ఆయ‌న ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వెళ్ల‌లేక‌పోయారు. ట్రాఫిక్ అస్త‌వ్య‌స్తంగా మార‌డం ప‌ట్ల‌ గ‌వ‌ర్న‌ర్ అసహ‌నం వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై అటు ప్ర‌ధాని కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అప్పుడే హరీశ్ కుమార్ గుప్తాపై వేటు ప‌డుతుంద‌ని అనుకున్నారు. తాజాగా ప్ర‌భుత్వం అదే చేసింది. 

ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి.. సివిల్స్‌కు ఎంపికైన ఐపీఎస్ అధికారి
ద్వారకా తిరుమలరావు గుంటూరువాసి కాగా.. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారి కాగా.. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌‌లో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. 1989లో ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌. ఈ దంప‌తులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు.
Advertisement
Dwaraka Tirumala RaoAP DGPAndhra Pradesh

More Telugu News

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03
..more