Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య కంట్లో పడ్డ భర్త నిర్వాకం.. యాపిల్ కంపెనీపై భర్త దావా!

UK Man Sues Apple After Wife Discovers
Advertisement
  • సెక్స్ వర్కర్ తో చాటింగ్ ను డిలీట్ చేసిన భర్త
  • ఐమెసేజెస్ సింక్రనైజేషన్ వల్ల భార్యకు దొరికిపోయానని వెల్లడి
  • భర్త నిర్వాకంతో విడాకులకు దరఖాస్తు చేసిన భార్య
  • ఇదంతా యాపిల్ కంపెనీ వల్లేనని ఆరోపిస్తున్న భర్త
Advertisement
ఇంగ్లాండ్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పై ఆయన భార్య విడాకుల దావా వేసింది. దీనివల్ల తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని భర్త వాపోయాడు. దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు. భార్య విడాకులు కోరితే భర్త యాపిల్ కంపెనీపై దావా వేయడమేంటని అనుకుంటున్నారా.. పూర్తిగా చదివేసేయండి మరి..

ఇంగ్లాండ్ వ్యాపారవేత్త తన ఇంట్లోని ఐమ్యాక్ తో ఓ సెక్స్ వర్కర్ తో ఛాటింగ్ చేశాడు. పనయ్యాక ఆ మెసేజ్ లు అన్నీ డిలీట్ చేశాడు. తన ఘనకార్యం ఎవరికంటా పడదని, ముఖ్యంగా భార్యకు తెలిసే అవకాశం లేదని నిశ్చింతగా ఉన్నాడు. అయితే, యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో ఐమెసేజెస్ కు ఓ సౌలభ్యం ఉంది. ఒకే యాపిల్ ఐడీతో ఉపయోగిస్తున్న ఐఫోన్, ఐమాక్ లలో ఏదైనా ఒక ఫోన్ లేదా మ్యాక్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు మరో ఫోన్ లేదా మ్యాక్ లో చూడొచ్చు. సింక్రనైజేషన్ ప్రక్రియ వల్ల ఇది సాధ్యపడుతుంది.

ఇది తెలియక సదరు భర్త నిశ్చింతగా ఉండగా.. భర్త నిర్వాకాన్ని తన ఫోన్ లో చూసిన భార్య మండిపడింది. విడాకులు కావాలంటూ కోర్టులో దావా వేసి, ఈ మెసేజ్ లను సాక్ష్యంగా అందజేసింది. విడాకులు మంజూరైతే భరణం కింద 5 మిలియన్ డాలర్లు భార్యకు చెల్లించాల్సి వస్తుందని, ఇటు భార్య దూరమై అటు ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఎదురైందని భర్త లబోదిబోమన్నాడు. దీనంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనని ఆరోపించాడు. ఐమెసేజ్ లు డిలీట్ చేసినపుడు ‘యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్’ అని సందేశం వచ్చిందని, దాంతో తాను భరోసాగా ఉన్నానని చెప్పాడు. అలా కాకుండా ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్’ అనో లేక ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్ ఓన్లీ’ అనో సందేశం కనిపిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు.

సెక్స్ వర్కర్ తో తన చాటింగ్ విషయాన్ని భార్య మూడ్ బాగున్నపుడు తానే చెప్పేవాడినని అన్నాడు. అయినా సరే తమ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని ఒప్పుకున్నాడు. అయితే, పరిస్థితి విడాకుల దాకా మాత్రం వచ్చేది కాదన్నాడు. తన ద్వారా తెలియాల్సిన విషయం యాపిల్ కంపెనీ నిర్వాకం వల్ల తెలిసేసరికి తన భార్య బాగా హర్టయిందని చెప్పాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత యాపిల్ కంపెనీదేనని స్పష్టం చేశాడు.  తనలాంటి పరిస్థితి ఎదుర్కొన్న యాపిల్ వినియోగదారులు కూడా ముందుకు వచ్చి న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చాడు.
Advertisement
Advertisement
Apple
Imac
Iphone
Divorce
Uk businesman
Sue
Court

More Telugu News