Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుషికొండ ప్యాలెస్ లోపల ఎలా ఉందో చూశారా... వీడియో ఇదిగో!

Video of Rishikonda palace went viral
Advertisement
  • గత ప్రభుత్వ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం
  • నేడు టీడీపీ నేతల చొరవతో విజువల్స్ బహిర్గతం
  • ప్యాలెస్ లోకి వెళ్లి పరిశీలించిన గంటా శ్రీనివాసరావు
  • ప్యాలెస్ లో సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిధులు
Advertisement
గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై తవ్వకాలు చేపట్టి నిర్మించిన రాజభవనం విజువల్స్ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో  ఎవరినీ ఆ భవనం వద్దకు అనుమతించకపోగా, ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో, స్థానిక ప్రజాప్రతినిధి గంటా శ్రీనివాసరావు మీడియాతో కలిసి రుషికొండ ప్యాలెస్ లో అడుగుపెట్టారు. లోపల కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. 

ఇప్పుడు యూట్యూబ్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ ప్యాలెస్ కు చెందిన వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన ఫ్లోరింగ్, వియత్నాం గ్రానైట్ స్టోన్, ఇటలీ మార్బుల్స్, విలాసవంతమైన షాండ్లియర్ లైటింగ్, లక్షల విలువ చేసే బాత్ టబ్ లు, ఓ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ సైజులో ఉన్న బాత్రూంలు, డిజైనర్ ఫ్యాన్లు, ఏసీలు, డైనింగ్ హాలు, ఓపెన్ కిచెన్ విశాలమైన కాన్ఫరెన్స్ హాలుతో ఈ ప్యాలెస్ ఔరా అనిపిస్తోంది. 

మాస్టర్ బెడ్ రూం కంటే బాత్రూం పెద్దదిగా ఉందంటే ఏ రేంజిలో దీన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. రూ.500 కోట్లతో నిర్మించారంటూ గతంలో వార్తలు వచ్చినా, ఇప్పుడా భవనం అడుగడుగునా ఉట్టిపడుతున్న లగ్జరీ చూస్తే భారీగానే ఖర్చుపెట్టారని తెలుస్తుంది. 

బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ భవన సముదాయంలో  ఇందులో మొత్తం ఏడు బ్లాకులు ఉన్నాయి. ప్రతి బ్లాకు ముందు అందంగా తీర్చిదిద్దిన గార్డెన్లు దర్శనమిస్తున్నాయి. టీడీపీ నేతల చొరవతో రుషికొండ భవనం లోపల ఏముందన్నది వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement
Rishikonda Palace
Visuals
Video
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News