మంత్రి పదవులు దక్కని సీనియర్లకు చంద్రబాబు భరోసా

14-06-2024 Fri 19:07 | Andhra
Advertisement
  • కొలువుదీరిన చంద్రబాబు 4.0 క్యాబినెట్
  • నేడు శాఖల కేటాయింపు
  • అయ్యన్న, గోరంట్ల, ధూళిపాళ్ల, నక్కా ఆనంద్ బాబులకు దక్కని మంత్రి పదవులు
  • పదవి దక్కని వాళ్ల సేవలు మరో రూపంలో ఉపయోగించుకుంటామన్న చంద్రబాబు
Advertisement
చంద్రబాబు 4.0 క్యాబినెట్ చూస్తే, కొత్తవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమ వంటి సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 

ఈ నేపథ్యంలో, నేడు సీఎం చంద్రబాబును మంత్రి పదవులు దక్కని సీనియర్లు కలిశారు. ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబును కలిశారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర క్యాబినెట్ కూర్పు ఏ ప్రాతిపదికన చేశామో వారికి వివరించారు. మంత్రివర్గంలో స్థానం లభించలేదని నిరాశ చెందవద్దని, మంత్రి పదవులు దక్కని వారి సేవలను ఇతర రూపాల్లో వినియోగించుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. 

అటు, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత తదితరులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులుగా బాధ్యతతో పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు.
Advertisement
ChandrababuSenior LeadersAP CabinetTDPAndhra Pradesh

More Telugu News

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03
..more