Nara Lokesh: నారా లోకేశ్ పదవీ ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి, భువనేశ్వరి స్పందన

Nara Brahmani and Bhuvaneswari reacts on Nara Lokesh oath taking as AP Minister
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, మాతృమూర్తి నారా భువనేశ్వరి స్పందించారు. 

"నారా లోకేశ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నేను గర్వపడుతున్నాను. నా వరకు ఇది భావోద్వేగభరిత అంశం. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు మీరు నవ్యోత్సాహంతో  మంత్రిగా ప్రస్థానం ప్రారంభిస్తున్న సమయంలో మీకు నా శుభాకాంక్షలు" అంటూ నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. 

అటు, నారా భువనేశ్వరి కూడా సోషల్ మీడియాలో స్పందించారు. "మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్ కు శుభాకాంక్షలు. ఒక తల్లిగా ఇది నాకు మర్చిపోలేని రోజు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకుని ఇటు చరిత్రలోనూ, అటు ప్రజల హృదయాల్లోనూ కలకాలం నిలిచిపోవాలని దీవిస్తున్నాను" అంటూ నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Nara Brahmani
Nara Bhuvaneswari
Minister
TDP
Andhra Pradesh

More Telugu News