రాహుల్ గాంధీ వదులుకునే స్థానంపై కేరళ కాంగ్రెస్ చీఫ్ హింట్
- వయనాడ్ స్థానం వదులుకోవచ్చునని చెప్పకనే చెప్పిన సుధాకరన్
- రాహుల్ గాంధీ వయనాడ్‌లోనే ఉండాలని ఆశించవద్దని వ్యాఖ్య
- దేశానికి నాయకత్వం వహించాల్సిన నేతకు మనం మద్దతుగా ఉండాలని సూచన
సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ... రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. అయితే ఆయన ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంది. ఏ నియోజకవర్గం వదులుకోవాలనే అంశంపై రాహుల్ గాంధీ కూడా డైలమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ చీఫ్ హింట్ ఇచ్చారు.