Gummadi: ఏ ఫంక్షన్ కి రాని శోభన్ బాబు, గుమ్మడి ఇంటికి ఎందుకు వెళ్లారంటే ..!

Gummadi sharada Interview
షార్ట్స్‌లో చూడండి
శోభన్ బాబు .. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రెస్ గా చెబుతారు. జీవితాన్ని ఎలా మలచుకోవాలి .. ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలనేది ఆయన తన తోటి నటీనటులకు చెప్పేవారు. ఆయన సలహాలు .. సూచనల కారణంగా ఎదిగినవారు ఇండస్ట్రీలో చాలామందినే కనిపిస్తారు. ఆయన గురించి ఎవరూ ఎక్కడా నెగెటివ్ గా చెప్పకపోవడం విశేషం. అలాంటి శోభన్ బాబు గురించి, గుమ్మడి కూతురు శారద ప్రస్తావించారు. 

"శోభన్ బాబుగారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఓ ఏడాది నాన్నగారి పుట్టినరోజు వేడుకను మద్రాసులో చేశాము. ఆ రోజంతా ఆయన మా నాన్నగారితోనే ఉన్నారు. సాధారణంగా శోభన్ బాబుగారు ఏ ఫంక్షన్ కి రారు. ఎవరింటికి వెళ్లరు. అలాంటి ఆయన ఒక రోజంతా నాన్నగారితోనే ఉన్నారంటే, ఆయనకి ఎంతటి అభిమానమో అర్థం చేసుకోవచ్చు" అని అన్నారు. 

"మా చిన్న చెల్లెలు పెళ్లికి ఆయన అవుట్ డోర్ షూటింగులో ఉన్నారు. అందువలన ఆయన శ్రీమతి ఆ ఫంక్షన్ కి వచ్చారు. సాధారణంగా ఆమె కూడా ఎక్కడికీ వెళ్లరు. నాన్నగారి పట్ల గౌరవంతో ఆమెను పంపించారు. ఇక రాజబాబుగారికి కూడా నాన్న అంటే ఎంతో అభిమానం. ఆయన నాన్న ముందు కూర్చునేవారు కాదు" అని చెప్పారు. 

Go Back to Shorts
Gummadi
Sobhan Babu
Rajababu
Tollywood

More Telugu News