యూపీలో బీజేపీకి చుక్కలు చూపించిన ఇండియా కూటమి.. 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమాచారం. 

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

Dhanyawaad Yatra
Congress
Uttar Pradesh
INDIA Bloc

More Telugu News