రామ్ తో త్రివిక్రమ్!

Ram in Trivikram Movie
  • 'డబుల్ ఇస్మార్ట్'తో బిజీగా రామ్ 
  • తరువాత ప్రాజెక్టులపై నడుస్తున్న టాక్ 
  • తెరపైకి త్రివిక్రమ్ - హరీశ్ పేర్లు 
  • త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా రూపొందుతోంది. గతంలో వీరి కాంబినేషన్ లో ఘన విజయాన్ని అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి ఇది సీక్వెల్. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను రామ్ ఎవరితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 

ఆ మధ్య రామ్ కి హరీశ్ శంకర్ ఒక కథను వినిపించినట్టుగా ఒక టాక్ వచ్చింది. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చేయనున్నాడనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' సినిమాతో బిజీగా ఉన్న హరీశ్, ఆ తరువాత పవన్ ప్రాజెక్టుతో బిజీ కానున్నాడు. అందువలన ఇప్పుడు త్రివిక్రమ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 

వెంకటేశ్ .. బన్నీలలో ఎవరో ఒకరితో త్రివిక్రమ్ సెట్స్ పైకి వెళతాడనే వార్త షికారు చేసింది. కానీ ఇప్పుడు రామ్ తోనే త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నాడనేది బలంగా వినిపిస్తోంది. స్రవంతి బ్యానర్ లోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
Go Back to Shorts
Ram
Trivikram
Harish Shankar

More Telugu News