ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ నమోదు: ఈసీ
- ఎనిమిది రాష్ట్రాల్లోని 58 స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్
- ఓటు హక్కును వినియోగించుకున్న 7.05 కోట్ల మంది ఓటర్లు
- మొదటి ఆరు దశల్లో ఓటేసిన 57.77 కోట్ల మంది ఓటర్లు
లోక్ సభ ఎన్నికల మొదటి ఆరు దశల్లో 87.54 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 57.77 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు మన దేశంలో ఉన్నారు. మన దేశంలోని ఓటర్ల సంఖ్య 96.88 కోట్లుగా ఉంది. ఈసీ ప్రకారం, మే 20న జరిగిన ఐదో దశ పోలింగ్‌లో 62.2 శాతం, నాల్గవ దశలో 69.16 శాతం, మూడో దశలో 65.68 శాతం, రెండో దశలో 66.71 శాతం, మొదటి దశ పోలింగ్‌లో 66.14 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.