మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి పట్ల చంద్రబాబు సంతాపం
- నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సీతాదేవి
- ఈ ఉదయం హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూత
- ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
యెర్నేని సీతాదేవి ఇవాళ ఉదయం హైదరాబాదులోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ముదినేపల్లి (ప్రస్తుతం ఏలూరు జిల్లా) నుంచి రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు.