రియల్మీ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్
- ఫ్లిప్‌కార్ట్‌పై రూ.3 వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లు
- ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.6 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం
- తక్కువ ధరకే లభిస్తున్న మూడు వేరియెంట్ల ఫోన్లు
రియల్మీ ప్రో ప్లస్ ఫీచర్లు ఇవే..
రియల్మీ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 1 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 67వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 20హెట్జ్ అధిక రిఫ్రెష్ రేట్, 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ, 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5.0పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 120రెట్ల సూపర్‌జూమ్ ఫీచర్‌తో 64ఎంపీ టెలిఫోటో కెమెరా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.