అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్
- కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్
- ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
- జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో ఈడీ పిటిషన్
కేంద్ర ఏజెన్సీ గతవారం మద్యం పాలసీ కేసులో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది. ఓ సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఓ రాజకీయ పార్టీ మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.