Advertisement

ఎన్టీఆర్ దేవర నుంచి 'ఫియర్ సాంగ్' రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Fear Song from NTR Devara will be out on May 19
  • ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర చిత్రం
  • ఈ నెల 19న ఫియర్ సాంగ్ రిలీజ్
  • అనిరుధ్ రవిచందర్ సంగీతం
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ చిత్రం దేవర. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే సాంగ్ విడుదల కానుంది. చిత్రబృందం ఈ పాటను ఫియర్ (భయం) సాంగ్ అని పేర్కొంటోంది. మే 19న ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన 14 సెకన్ల ప్రోమోను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర చిత్రం దసరా సీజన్ లో అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో ఇదే ఫస్ట్ పిక్చర్. 

దేవర చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫియర్ సాంగ్ టీజర్ లో అనిరుధ్ మ్యూజిక్ వింటే పాటకు తగ్గట్టే బీభత్సంగా ఉంది.
Advertisement
Fear Song
Vijay Devarakonda
Jr NTR
Koratala Siva
Tollywood

More Telugu News