దేశపు జెండాకు ఉన్నంత పొగరు మీ గెలుపులో మాకుంటుంది: సాయి ధరమ్ తేజ్
- ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేనాని గెలుపును కాంక్షిస్తోందని వ్యాఖ్య
- నిజాయితీగా ప్రజాసేవ చేసే నిస్వార్థ నాయకుడంటూ ప్రశంసలు
- పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా విష్ చేసిన మెగా హీరో
ఏపీ ప్రజల ఆశీర్వాదంతో, నిజాయితీగా ప్రజాసేవ చేసే జనసేనానిని ఈ ఎన్నికల్లో విజయం వరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయనకు మరింత పవర్ ను కట్టబెట్టాలని, జనసేనానిపై, ఆయన ఆలోచనలపై, ఆయన విజన్ పై నమ్మకం ఉన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జరగబోయే ఎన్నికల్లో బాధ్యతగా ఓటేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.