బీజేపీ వాళ్ళకు చెబుతున్నా... ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్ళను ఆ దేవుడు కూడా క్షమించడు: రేవంత్ రెడ్డి

09-05-2024 Thu 17:58 | Telangana
Advertisement
  • దేవుడు గుడిలో ఉండాలి...  భక్తి గుండెల్లో ఉండాలన్న రేవంత్ రెడ్డి
  • రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ ఎన్నికల సమయంలోనే బీజేపీకి గుర్తుకు వస్తాయని విమర్శ
  • మోదీ పదేళ్ల పాలనలో ఇచ్చింది గాడిద గుడ్డు అన్న రేవంత్ రెడ్డి
Advertisement
'దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్‌లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్లలాగా (మీరు)... రాముడినో, హనుమంతుడినో వాడుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీవాళ్లకు చెబుతున్నా' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు, హనుమాన్ జయంతి, బతుకమ్మ, బోనాల పండుగలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. మన తాతలు, తండ్రులు ఈ పండుగలు చేయలేదా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్ వయస్సు మీద పడిందని... ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ప్రజలు ఆయనను బండకేసి కొట్టారని, తిరస్కరించారని... ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదన్నారు. మెదక్ నుంచి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మధును గెలిపిస్తే మెదక్ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఈ పదేళ్లలో మోదీ మనకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఘన విజయం సాధించి... ప్రధాని అయ్యారని గుర్తు చేశారు.

ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. బీహెచ్ఈఎల్, ఇతర పరిశ్రమలు వచ్చినట్లు తెలిపారు. గత పాతికేళ్లుగా మెదక్ లోక్ సభ స్థానం బీఆర్ఎస్, బీజేపీ చేతిలో నలిగిపోయిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్ కోసం భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డిలు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కరీంనగర్ నుంచి వెంకట్రామిరెడ్డిని తీసుకువచ్చి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు.
Advertisement
Revanth ReddyCongressBJPLok Sabha Polls

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more