తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
- నిన్న సాయంత్రం హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
- సికింద్రాబాద్‌లో అత్యధికంగా 136.8 సెంటీమీటర్ల వర్షం
- హెచ్చరికలు జారీచేసిన పోలీసు శాఖ
నిన్న సాయంత్రం ఏడు గంటల సమయానికే సికింద్రాబాద్‌లో అత్యధికంగా 136.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కేపీహెచ్బీలో 102.3 సెంటీమీటర్లు, చందానగర్‌లో 86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ఎవరూ చెట్ల కిందకు వెళ్లవద్దని, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాగవద్దని హెచ్చరించింది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే 100కి డయల్ చేయాలని కోరింది.