Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం

Hero Venkatesh campaign for Congress candidate
Advertisement
  • సాయంత్రం ఖమ్మంలో రోడ్డు షో నిర్వహించిన వెంకటేశ్
  • రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
  • కాంగ్రెస్ అభ్యర్థికి వెంకటేశ్ వియ్యంకుడు
Advertisement
ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ రోడ్డు షోకు పెద్ద ఎత్తున వెంకటేశ్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో వెంకటేశ్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి వెంకటేశ్ వియ్యంకుడు.

అంతకుముందు, వెంకటేశ్ ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడు... మంత్రి ఇంటికి వచ్చాడని తెలియడంతో అభిమానులు తరలి వచ్చారు. వెంకటేశ్ భవనం పై నుంచి చేయి ఊపుతూ అభిమానులను అలరించారు.

Advertisement
Advertisement
Venkatesh Daggubati
Congress
Khammam District
Lok Sabha Polls

More Telugu News