ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
- ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు ఈ నెల 7 నుంచి ఈ-పాస్ తప్పనిసరి
- సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- ఈ వేసవి విడిది కేంద్రాలకు వెళ్లే టూరిస్టులు వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి ఈ-పాస్ పొందే వెసులుబాటు
ఇకపై ఊటీ, కొడైకెనాల్ వెళ్లే టూరిస్టులు, వ్యాపారులు epass.tnega.org వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి ఈ-పాస్ పొందవచ్చు. కాగా, వాహన రద్దీని క్రమబద్ధీకరించడానికే ఈ విధానం అమలు చేసినట్టు తమిళనాడు సర్కార్ వెల్లడించింది. ఇక ఈ విధానం జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అమలులో ఉంటుందని, దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది.