జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి: చంద్రబాబు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాధితుడిని తాను అని చెప్పిన పీవీ రమేశ్
- తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని మండిపాటు
- ఈ చట్టం వల్ల మీ భూమి, మీ స్థలం, మీ పొలం మీది కాకుండా పోతుందన్న చంద్రబాబు
పీవీ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ సీఎం కార్యాలయంలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే... ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఊహించండని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి, మీ స్థలం, మీ పొలం మీది కాదని అన్నారు.