చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
- లకలకా లకలకా అంటూ రక్తాన్ని పీల్చుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు
- చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్న సీఎం
- పెదకూరపాడు బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత
చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..
చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రముఖిని నిద్రలేపితే మళ్లీ ఇంటింటికీ ‘లకలకా లకలకా’ అంటూ మీరు రక్తం తాగేందుకు వస్తుంది’’ అనే ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని జగన్ అన్నారు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. చంద్రబాబుని ఓడించడానికి, పేదలను గెలిపించడానికి మరోసారి విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, కురాన్ లాంటిదని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు సెంటర్ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.