ఏపీలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన నమిత
- ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్
- నేడు ధర్మవరంలో రోడ్ షో
- భర్తతో కలిసి హాజరైన నమిత
- నమితను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనాలు
ఆమె తన భర్తతో కలిసి ధర్మవరం వచ్చారు. ఇక్కడి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మవరం టౌన్ లో నిర్వహించిన రోడ్ షోలో నమితను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.
ఏపీలో పొత్తు కారణంగా ధర్మవరం అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు. ఇక్కడ్నించి సత్యకుమార్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.