రజనీకాంత్ తో 'కూలి' నిర్మిస్తున్న సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసు!
- రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబోలో కూలి మూవీ
- ఇటీవల విడుదలైన మూవీ టైటిల్ టీజర్
- ఈ టైటిల్ టీజర్‌లో అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడినట్టు ఇళయరాజా నోటీసు
- కూలి చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్
తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ఆ పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసు పంపించడం జరిగింది. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక తన సంగీతంలోని పాటలను తన అనుమతిలేకుండా స్టేజ్ షోలలో ఆలపించకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. దానిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులూ పెడుతుండటం ఇప్పుడు గమనించదగిన విషయం.