జియో సేవ‌ల‌పై న‌టి ఖుష్బు మండిపాటు!

బీజేపీ నేత‌, న‌టి ఖుష్భు సుంద‌ర్‌ జియో సేవ‌ల‌పై మండిప‌డ్డారు. హైదరాబాద్ జియో సేవలు అత్యంత దుర్భ‌లంగా ఉన్నాయంటూ ద‌య్య‌బట్టారు. జియో సేవలు అంత బాగా లేవని, కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఫిర్యాదు చేసి 24 గంట‌లు గ‌డిచినా కూడా కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి స్పంద‌న‌ రాక‌పోవ‌డం శోచ‌నీయం అన్నారు. ఇలాంటిది ఎక్క‌డా చూడ‌లేదని పేర్కొన్నారు. కాస్త బెటర్ స‌ర్వీస్‌ ఉంటుందని ఊహించానని ఖుష్బు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఖుష్బు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది. మరి ఈ ట్వీట్‌పై జియో నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.

Khushbu Sundar
Jio Service
Hyderabad
Telangana

More Telugu News