కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయి: జగ్గారెడ్డి

Jaggareddy on Brs
షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలో ఇప్పటి వరకు రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... మరోసారి జయకేతనం ఎగురవేసేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. బీజేపీ ఎన్నికల వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరేలా ఉంటున్నాయి. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 400కు పైగా సీట్లను గెలుస్తామని మోదీ చెపుతున్నాడని... అన్ని సీట్లను గెలిచి మోదీ చేసేదేముందని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పని అయిపోయిందని... ఆ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతామని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు.

Go Back to Shorts
Jagga Reddy
Congress

More Telugu News