నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి జరిపిస్తున్నారు: అంజలి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి జరిపిస్తున్నారు: అంజలి

Anjali Interview
  • 18 ఏళ్ల కెరియర్ చూశానన్న అంజలి 
  • 'గీతాంజలి' మంచి గుర్తింపు తెచ్చిందని వెల్లడి
  • తన పెళ్లికి సంబంధించిన పుకార్లపై స్పందన 
  • తన సినిమా రిలీజ్ సమయంలో ఇలా జరుగుతుందని వ్యాఖ్య  

అంజలి ప్రధానమైన పాత్రగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా రూపొందింది. ఇటీవలే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నేపథ్యంలో అంజలి 'ఆలీతో సరదాగా' సీజన్ 2 లో పాల్గొన్నారు. అంజలి మాట్లాడుతూ .. " గతంలో వచ్చిన 'గీతాంజలి'ని నేను ఎంతగా ఎంజాయ్ చేస్తూ చేశానో, ఈ సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు బాగా నచ్చిన కథ ఇది" అని అన్నారు.

"ఈ కథను నాకు కోన గారు 'నిశ్శబ్దం' సినిమా సమయంలో వినిపించారు. అది వర్కౌట్ కావడానికి ఇంత సమయం పట్టింది. నేను నా కెరియర్ ను మొదలుపెట్టి 18 ఏళ్లు అవుతోంది. ఇక 'గీతాంజలి' నేను చేసిన ఫస్టు లేడీ ఓరియెంటెడ్ సినిమా. నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన మూవీ. ఆ సినిమా చేసిన పదేళ్లకు సీక్వెల్ చేశాను. ఈ పదేళ్లలో నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పారు. 

"నా పెళ్లికి సంబంధించిన రూమర్స్ తరచూ షికారు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నాకు ఐదారు పెళ్లిళ్లు చేశారు. ఒకసారి బిజినెస్ మెన్ అంటారు .. మరోసారి ఓ సీనియర్ నిర్మాత అంటారు. ఇలా ఏడాదికి ఒకరితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నా ప్రతి సినిమా విడుదలకి ముందు ఇలాంటి ప్రచారం మొదలుకావడం నేను గమనించిన విషయం" అని అన్నారు.
Advertisement
Anjali
Actress
Tollywood

More Telugu News