జగన్ పై దాడి జరిగితే అందరూ ఖండించారు... వాళ్లిద్దరూ వెటకారం ప్రదర్శించారు: మంత్రి బొత్స
Advertisement
- విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
- చంద్రబాబు, పవన్ పై ధ్వజమెత్తిన మంత్రి బొత్స
- సీఎంపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
Advertisement
ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని... కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
బాబు సైకిల్ కు చాన్నాళ్ల కిందటే తుప్పు పట్టింది... పవన్ ఎలాంటివాడో ఆయన మాటల ద్వారానే అర్థమవుతోంది... జగన్ యాక్టర్ కాదు... రియల్ హీరో... రాళ్లేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉందేమో... జగన్ పై దాడి వెనుక కుట్ర ఉంది అంటూ బొత్స వ్యాఖ్యానించారు.