అంతరిక్షం నుంచి గ్రహణం కనిపించిందిలా.. నాసా వీడియో ఇదిగో!
- నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
- అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో తీసిన సైంటిస్టులు
- ఆకాశంలో 4 నిమిషాల పాటు కనువిందు చేసిన ఖగోళ అద్భుతం
ఇక సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది. అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని లైవ్ లో చూపించింది. గ్రహణ కాలంలో నార్త్ అమెరికాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చీకట్లు కమ్మేసిన దృశ్యాలను కెమెరాలో బంధించింది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా సైంటిస్టులు ఈ వీడియోను పంపించగా.. నాసా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నాసా యూట్యూబ్ ఛానల్ లోనూ లైవ్ ఏర్పాటు చేసింది. నార్త్ అమెరికాలోని మెక్సికో బీచ్ లకు అమెరికన్లు పోటెత్తారు.
ఒకటి రెండు రోజులు ముందుగానే మాజట్లాన్ సిటీకి చేరుకుని తీర ప్రాంతాలలో సందడి చేశారు. ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ 2044 లోనే అమెరికాలో కనిపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షించాలంటే 2046 లోనే సాధ్యమని నాసా వెల్లడించడంతో జనాలలో ఆసక్తి పెరిగింది. నాసా ట్వీట్ చేసిన సూర్యగ్రహణం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.