కవితకు తీవ్ర నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు
- మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత
- కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన కవిత
- కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.