స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ
- చంద్రబాబు ఏ1గా చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ
- ఈ కేసులో గతంలో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు
- విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విచారణ
నాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
దాదాపు రెండు నెలల పాటు రాజమండ్రి జైల్లో గడిపిన చంద్రబాబు గతేడాది అక్టోబరు 31న విడుదలయ్యారు.