జైల్లో చదివేందుకు భగవద్గీత, రామాయణంతో పాటు కుర్చీ, బల్ల కావాలని కోరిన కేజ్రీవాల్
- ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకం కూడా అందుబాటులో ఉంచాలని కోరిన కేజ్రీవాల్
- మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి
తనకు జైల్లో చదివేందుకు రామాయణం, భగవద్గీత కావాలని, అలాగే జర్నలిస్ట్ నీరజా చౌదరి రాసిన 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకం కావాలని, వాటిని అందుబాటులో ఉంచాలని కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని కోరారు. ఇప్పటికే ధరిస్తోన్న లాకెట్‌ను అనుమతించాలని కోరారు.