సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే.. కాంగ్రెస్ లో చేరికపై చర్చ
- బీఆర్ఎస్ ను వీడిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు
- కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ తో చర్చించిన కేకే
- కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు ప్రచారం
నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయిన సంగతి తెలిసిందే. కేకే పార్టీ మారుతుండటంపై కేసీఆర్ సీరియస్ అయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పదేళ్లు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించారా? అని కేసీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. దేనికీ సమాధానాలు ఇవ్వని కేకే... చివరకు తన కెరీర్ కాంగ్రెస్ లోనే ప్రారంభమయిందని, కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.