ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు
- కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానన్న కవిత
- ఇది మనీ లాండరింగ్ కేసు కాదని వ్యాఖ్య
- తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వెల్లడి
మరోవైపు, కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని... కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదని... పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని, మరో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని చెప్పారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇదొక తప్పుడు కేసు అని... తాను క్లీన్ గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.