కేరళలో ఆలయ వేడుకల్లో ఏనుగుల ఫైట్.. వీడియో ఇదిగో!
- త్రిస్సూర్ లోని థారక్కల్ ఆలయంలో ఘటన.. పలువురికి గాయాలు
- శుక్రవారం రాత్రి అంబారీపై ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
- వేడుకకు భారీగా హాజరైన జనం
ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగా మరో ఏనుగుపై దాడి చేసింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది. నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.